కేరళలో కొత్త వైరస్..8మంది మృతి

May 21, 2018
img

కేరళలో ఇంకా గుర్తించని ఒక కొత్తరకం వైరస్ బారినపడి 8మంది మరణించగా మరో 25 మంది ఆసుపత్రి పాలయ్యారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వారు ముగ్గురూ ఒకే కుటుంబానికే చెందినవారుకావడం విశేషం. అంతుపట్టని ఈ వ్యాధిని అరికట్టేందుకు కేరళ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఏవీ ఫలించకపోవడంతో, కేంద్రప్రభుత్వ సహాయం అర్ధించింది. కేరళ ప్రభుత్వం అభ్యర్ధన మేరకు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి జెపి నడ్డా నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ సంస్థకు చెందిన వైద్య నిపుణులను హుటాహుటిన కేరళకు పంపించారు. వారు రోగులను పరిశీలించి వారి రక్తనమూనాలను సేకరించి పూణేలోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పరీక్షల నిమిత్తం పంపారు. కోతులు, పక్షులు కొరికిన పండ్లలను తినడం వలన ఈ వైరస్ మనుషులలో వ్యాపిస్తున్నట్లు డిల్లీ నుంచి వచ్చిన వైద్య నిపుణులు అనుమానిస్తున్నారు. 


Related Post