సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి

May 12, 2018
img

సిరిసిల్లా జిల్లా కేంద్రంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 300 పడకల సామర్ధ్యంతో ఏర్పాటు అవుతున్న ఈ ఆసుపత్రి కోసం ప్రభుత్వం రూ.158.70 కోట్లు విడుదల చేసింది. ఈమేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి ఏ.శాంతకుమారి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. 

ఈ ఆసుపత్రిలో గుండె, జీర్ణాశయం, ఛాతి, మూత్రపిండాలు, కళ్ళు, నరాలు, క్యాన్సర్ వ్యాధులకు అత్యాధునిక వైద్య పరికరాలతో చికిత్స అందించబోతోంది. ఆసుపత్రిలో 10 ఆపరేషన్ ధియేటర్లు ఏర్పాటు చేయబడతాయి. ప్లాస్టిక్ సర్జరీతో సహా 15 రకాల వైద్యసేవలు ఈ ఆసుపత్రిలో లభిస్తాయి. ఆసుపత్రి నిర్మాణానికి నిధులు సిద్దంగా ఉన్నాయి కనుక ఒక ఏడాది వ్యవధిలోనే ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. 

సిరిసిల్లా జిల్లా కేంద్రంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించడం వలన దాని చుట్టూపక్కల గల ఆదిలాబాద్, కుమ్రుం భీమ్, జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సిద్ధిపేట, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలలో నివసించే ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

Related Post