ఏప్రిల్ నుంచే వారికీ రూ.1,000 పెన్షన్

April 20, 2018
img

రాష్ట్రంలో బోధకాలు వ్యాధితో బాధపడుతున్నవారు సుమారు 60,000 మంది వరకు ఉన్నట్లు అధికారులు లెక్కకట్టారు. వారందరూ శారీరికంగా, మానసికంగా పూర్తి ఆరోగ్యంగానే ఉన్నప్పటికీ బోధకాలు వ్యాధి కారణంగా వాచిపోయిన కాళ్ళతో ఏ పనులు చేసుకోలేక దయనీయజీవితాలు గడుపుతున్నారు.

ఇంతకాలం వారి సమస్యను ఏ దేశంలో ప్రభుత్వమూ తీవ్ర సమస్యగా భావించకపోవడంతో ఎవరూ వారిని పట్టించుకోలేదు. కానీ ముఖ్యమంత్రి కెసిఆర్ దృష్టికి వారి సమస్యరాగానే తక్షణం వారికి కూడా నెలకు రూ.1,000 పెన్షన్ అందజేయాలని సంబందిత శాఖల అధికారులను ఆదేశించారు.

అయన ఆదేశాల మేరకు, ఏప్రిల్ నెల నుంచే రాష్ట్రంలో బోధకాలుతో బాధపడుతున్నవారికి రూ.1,000 పెన్షన్ మంజూరు చేస్తూ వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి శాంతి కుమారి నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. కనుక రాష్ట్రంలో ఇంకా పేర్లు నమోదు చేసుకోని బోధకాలు వ్యాధిగ్రస్తులు అందరూ తక్షణమే తమ శాఖ కార్యాలయాలలో తమ పేర్లను నమోదు చేసుకోవలసిందిగా విజ్ఞప్తి చేశారు. 

Related Post