ఆదిలాబాద్ లో 2 డయాలసిస్ సెంటర్లు షురూ

January 22, 2018
img

రాష్ట్రంలో నిరుపేద కిడ్నీ రోగుల కోసం రాజధాని హైదరాబాద్ తో సహా అన్ని జిల్లాలలో కలిపి మొత్తం 40 డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి ఆదివారం ఆదిలాబాద్ జిల్లాలో రెండు డయాలసిస్ సెంటర్లను ప్రారంభించారు. ఒకటి జిల్లా కేంద్రంలో గల రిమ్స్ ఆసుపత్రిలో మరొకటి ఉట్నూరులో ఏర్పాటు చేయబడ్డాయి.  ఉట్నూరు ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో డయాలసిస్ సెంటర్ తో బాటు, సీటీ స్కానింగ్, ఎక్స్-రే, చిన్నారులకు ఐసియు కేంద్రాన్ని కూడా మంత్రి ప్రారంభించారు. 

ఈ సందర్భంగా మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ డయాలసిస్ సెంటర్లలో ఫిల్టరింగ్ పరికరాలను కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. జిల్లాలో పేద కిడ్నీ రోగులు అందరూ అవసరమైనప్పుడు ఈ రెండు డయాలసిస్ సెంటర్లలో ఉచితంగా రక్తశుద్ధి చేయించుకోవచ్చునని చెప్పారు. గ్రామీణ ప్రాంతాలకు అత్యాధునిక వైద్య సౌకర్యాలు కల్పించడంతోబాటు, రోగనివారణకు ముందుగానే టీకాలు వేయడం, ప్రజలలో పరిశుభ్రత పట్ల అవగాహన పెంచడం వంటి కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున చేపదుతున్నామని చెప్పారు. తెలంగాణా రాష్ట్రంలో సెమీ అటనమస్ హోదా కలిగిన మెడికల్ కాలేజీలకు పూర్తిగా స్వయంప్రతిపత్తి కల్పించడానికి అవసరమైన చర్యలు తమ ప్రభుత్వం చేపడుతోందని మంత్రి లక్ష్మారెడ్డి చెప్పారు.    


Related Post