ఆర్టీసిలో ఉద్యోగాలు రైట్..రైట్!

November 22, 2017
img

ఉద్యోగాల భర్తీ కోసం రాష్ట్ర ప్రభుత్వంపై శాసనసభ లోపల బయటా కూడా ఒత్తిడి పెరుగుతుండటం, సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుండటం వంటి అనేక కారణాల చేత ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేసినట్లుంది. నిన్న ప్రభుత్వ జూనియర్ కాలేజీల 1133 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభుత్వం, ఈరోజు టిఎస్ ఆర్టీసిలో 279 పోస్టుల భర్తీకి ఉత్తర్వులు జారీ చేసింది. వాటిలో మెకానికల్ సూపర్ వైజర్ ట్రైనీలు:123 , ట్రాఫిక్ సూపర్ వైజర్ ట్రైనీలు:84, జూనియర్ అసిస్టెంట్లు:72 పోస్టులు ఉంటాయి. వీటికి త్వరలోనే టి.ఎస్.పి.ఎస్.సి.నోటిఫికేషన్ విడుదల చేస్తుంది.


Related Post