1,133 పోస్టుల భర్తీకి లైన్ క్లియర్

November 22, 2017
img

తెలంగాణా రాష్ట్రంలో గల 79 ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో కొత్తగా 1133 పోస్టుల భర్తీకి రాష్ట్ర ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్ శివశంకర్ మంగళవారం జీవో (170) జారీ చేశారు. వీటిలో భోధన, భోదనేతర పోస్టులు రెండూ ఉన్నాయి. ఆ వివరాలు: ప్రిన్సిపాల్:43, జూనియర్ లెక్చరర్: 781, ఫిజికల్ డైరెక్టర్:78, సీనియర్ అసిస్టెంట్: 80, లైబ్రేరియన్: 78, అటెండర్ మరియు ఇతర సిబ్బంది: 387 పోస్టులను భర్తీ చేయబోతున్నారు. ఈ పోస్టుల భర్తీ చేయడానికి టి.ఎస్.పి.ఎస్.సి.త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. 


Related Post