చదువుల ఒత్తిడికి మరో విద్యార్ధి బలి

November 16, 2017
img

పెద్ద చదువులు చదువుకొంటే మంచి ఉద్యోగం...చక్కటి జీవితం లభిస్తుందనేది సర్వసాధారణ అభిప్రాయం. అయితే ఇప్పుడు ఆ పెద్ద చదువులే విద్యార్ధుల ప్రాణాలను బలిగొంటున్నాయి. మార్కుల కోసం కాలేజీ యాజమాన్యాలు చేసే ఒత్తిడి కారణంగా ఇటీవల కాలంలో వరుసగా అనేక మంది విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకొన్నారు. అదే కారణం చేత ఇవ్వాళ్ళ మరో విద్యార్ధి బలైపోయాడు.

ఘాట్ కేసర్ వద్ద అవుషాపూర్ లో గల విజ్ఞాన్ భారతి ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్న రావి అభిషేక్ రెడ్డి (20) అనే విద్యార్ధి ఆత్మహత్య చేసుకొన్నాడు. అతని తల్లితండ్రులు నాగేందర్ రెడ్డి, కవిత మేడ్చల్ జిల్లాలోని నాగారంలో నివసిస్తున్నారు. నిన్న మధ్యాహ్నం తల్లితండ్రులతో మాట్లాడిన తరువాత బయటకు వెళుతున్నానని చెప్పి బయలుదేరిన అభిషేక్ రెడ్డి సికింద్రాబాద్ సమీపంలో ఆలుగడ్డ వద్ద రైలు క్రిందపడి ఆత్మహత్య చేసుకొన్నాడు. అతనికి కాలేజీలో హాజరు తక్కువైనందున డిటెన్షన్ ఇవ్వడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకొన్నట్లు తెలుస్తోంది.  


Related Post