నేషనల్ హెల్త్ మిషన్‌లో ఉద్యోగావకాశాలు

January 11, 2021
img

నేషనల్ హెల్త్ మిషన్, తెలంగాణ రాష్ట్రంలో కొన్ని పోస్టులను అవుట్‌సోర్సింగ్ విధానంలో భర్తీ చేయబోతోంది. వాటి కోసం అర్హత గల అభ్యర్థులు నుండి దరఖాస్తులు ఆహ్వానించింది. 

ఖాళీల వివరాలు: 

(1) డిస్టిక్ ప్రోగ్రామ్ ఆఫీసర్-11

(2) డిస్ట్రిక్ట్ అచీవ్మెంట్ మేనేజర్-11

(3) డిస్ట్రిక్ట్ మేనేజర్-8.

 విద్యార్హతలు, వయోపరిమితి: 

డిస్టిక్ ప్రోగ్రామ్ ఆఫీసర్‌ ఉద్యోగానికి మాస్టర్ ఇన్ పబ్లిక్ హెల్త్/డిప్లమా ఇన్ పబ్లిక్ హెల్త్/ఎమ్మే సోషియాలజీ/ ఎంఎస్‌డబ్ల్యూ/ ఎమ్మెస్సీ(సోషల్ సైన్స్). ప్రజారోగ్యంలో కనీసం మూడేళ్లు ఉద్యోగానుభవం కలిగి ఉండాలి. వయోపరిమితి: 34 సంవత్సరాలు.

డిస్టిక్ క్వాలిటీ అస్యూరెన్స్ మేనేజర్‌ ఉద్యోగానికి మాస్టర్ ఇన్ హాస్పిటల్ మేనేజిమెంట్/మాస్టర్ ఇన్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్/మాస్టర్ ఇన్ హెల్త్ కేర్ మేనేజిమెంట్. సంబందిత రంగంలో కనీసం మూడేళ్లు ఉద్యోగానుభవం కలిగి ఉండాలి. వయోపరిమితి: 34 సంవత్సరాలు.

డిస్టిక్ ఎకౌంట్ మేనేజర్‌ ఉద్యోగానికి ఎంబీఏ( ఫైనాన్స్)/ ఎం.కామ్ విత్ కంప్యూటర్ నాలెడ్జ్.

ఈ ఉద్యోగాలకు సంబందించి పూర్తి వివరాల కొరకు chfw.telangana.gov.in లో చూడవచ్చు. ఈ నెల 6వ తేదీ నుంచి 22 సాయంత్రం 5 గంటలలో లోపుగా దరఖాస్తులు సమర్పించవచ్చు. 

Related Post