తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం

November 03, 2020
img

తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డు చాలా కీలక నిర్ణయం తీసుకొంది. కరోనా కారణంగా ఈ ఏడాది 27,589 మంది విద్యార్దులకు గ్రేస్ మార్కులు ఇచ్చి అందరినీ పాస్ చేయాలని నిర్ణయించింది. వారిలో 27,251 మంది పరీక్షలకు హాజరుకాలేదు. మరో 338 మంది మాల్ ప్రాక్టీస్ (కాపీ కొట్టడం) పాల్పడి బహిష్కరింపబడినవారున్నారు. వారందరికీ కూడా గ్రేస్ మార్కులు ఇచ్చి పాస్ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు కూడా జారీ చేసింది.   


Related Post