టిఎస్ ఐసెట్ ఫలితాలు విడుదల

November 02, 2020
img

తెలంగాణ ఉన్నతవిద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి సోమవారం మధ్యాహ్నం టిఎస్ ఐసెట్ ఫలితాలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ ఏడాది మొత్తం 45,975 మంది పరీక్షకు హాజరుకాగా వారిలో 90.28 శాతం అంటే 41,506 మంది విద్యార్దులు అర్హత సాధించారని పాపిరెడ్డి తెలిపారు. కరోనా భయాల నేపధ్యంలో కూడా విద్యార్దులు చాలా ధైర్యంగా పరీక్ష వ్రాసి మంచి ఫలితాలు సాధించారని వారికి అభినందనలు తెలియజేస్తున్నానని పాపిరెడ్డి అన్నారు. విద్యార్దులు తమ ర్యాంకులు తెలుసుకొనేందుకు https://icet.tsche.ac.in/TSICET/TSICET_GetRankCard2K.aspx ను సందర్శించవచ్చు. 

టిఎస్ ఐసెట్ ఫలితాలలో తొలి 5 ర్యాంకులు సాధించిన విద్యార్దుల వివరాలు: 

బి.శుభశ్రీ (ఎస్ఆర్ నగర్, హైదరాబాద్‌): 159.5 మార్కులు 

జి.సందీప్ (అర్మూర్, నిజామాబాద్‌): 144.50 మార్కులు 

అవినాష్ సిన్హా (ఈసీఐఎల్, హైదరాబాద్‌): 142.43 మార్కులు 

ఏ. ప్రసన్నలక్ష్మి (వరంగల్‌): 142 మార్కులు 

శ్రీకృష్ణ సాయి (ఇబ్రహీంపట్నం, హైదరాబాద్‌): 141.40 మార్కులు. 

Related Post