అక్టోబర్ 9నుంచి తెలంగాణలో ఇంజనీరింగ్ ప్రవేశాలు

October 06, 2020
img

ఈనెల 9వ తేదీ నుంచి తెలంగాణలో ఇంజనీరింగ్ కాలేజీలలో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభించాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. వీటికి సంబందించి పూర్తి వివరాలను బుదవారం ఆన్‌లైన్‌లో ఉంచబోతున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు.

ఇంజనీరింగ్ కాలేజీలలో ప్రవేశాల ప్రక్రియలో భాగంగా సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కొరకు మొత్తం 36 హెల్ప్ లైన్ సెంటర్లు ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు.  ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇవి పనిచేస్తాయి. ప్రతీ అరగంటకు ఓ స్లాట్ బుకింగ్ ఉంటుంది. విద్యార్దులు రిజిస్ట్రేషన్ సమయంలోనే ఆన్‌లైన్‌లో తాము కోరుకొన్న హెల్ప్ లైన్ సెంటర్, తేదీ, సమయాలను ఎంచుకోవలసి ఉంటుంది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయడానికి ఎస్సీ, ఎస్టీ విద్యార్దులకు రూ.600, ఇతరులకు రూ.1,200 ప్రాసెసింగ్ ఫీజును చెల్లించవలసి ఉంటుంది.

ఈనెలలో రెండు దశలలో ప్రవేశాల ప్రక్రియను పూర్తి చేసి మిగిలిన సీట్లకు నవంబర్‌ 4 నుంచి స్పాట్ అడ్మిషన్స్ ప్రక్రియ ప్రారంభించాలని నిర్ణయించినట్లు తెలిపారు. స్పాట్ అడ్మిషన్స్‌కు సంబందించి మార్గదర్శకాలను https://tseamcet.nic.in వెబ్‌సైట్‌లో చూడవచ్చని తెలిపారు. 

నవంబర్‌5వ తేదీకి అడ్మిషన్స్ ప్రక్రియ పూర్తిచేసి నవంబర్‌ 10 లేదా 15వ తేదీ నుంచి ఇంజనీరింగ్ తరగతులు ప్రారంభించాలని నిర్ణయించినట్లు తెలిపారు. 

ఇంజనీరింగ్ కాలేజీలలో ప్రవేశాల ప్రక్రియ షెడ్యూల్ ఈవిధంగా ఉంటుంది:

 

మొదటి దశ ప్రవేశ ప్రక్రియ షెడ్యూల్

రెండవ మరియు చివరి దశ ప్రవేశ ప్రక్రియ షెడ్యూల్

అక్టోబర్ 9 నుంచి 17వరకు

ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్   

అక్టోబర్ 29వ తేదీ

ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్ (మొదటి దశలో పాల్గొనని వారికి మాత్రమే)  

అక్టోబర్ 12 నుంచి 20 వరకు

 సర్టిఫికెట్ల వెరిఫికేషన్, వెబ్‌ ఆప్షన్స్

అక్టోబర్ 30

సర్టిఫికెట్ల వెరిఫికేషన్

అక్టో 22 నుంచి

మొదటిదశ సీట్ల కేటాయింపు

అక్టోబర్ 30,31

వెబ్‌ ఆప్షన్స్

అక్టోబర్ 22 నుంచి 27వరకు

ఆన్‌లైన్‌లో ట్యూషన్ ఫీజు చెల్లింపు, సెల్ఫ్ రిపోర్టింగ్

నవంబర్‌ 2 నుంచి

సీట్ల కేటాయింపు

నవంబర్‌ 2 నుంచి 5 వరకు

కాలేజీలలో రిపోర్టింగ్ చేయడం

నవంబర్‌ 2 నుంచి 5 వరకు

ఆన్‌లైన్‌లో ట్యూషన్ ఫీజు చెల్లింపు, సెల్ఫ్ రిపోర్టింగ్.

కాలేజీలలో రిపోర్టింగ్ చేయడం

నవంబర్‌ 4వ తేదీ

ప్రైవేట్ ఇంజనీరింగ్ మరియు బీఫార్మసీ కాలేజీలలో స్పాట్ అడ్మిషన్లు

Related Post