ఇంటర్ విద్యాసంవత్సరం 182 రోజులకు కుదింపు

September 11, 2020
img

లాక్‌డౌన్‌, కరోనా కారణంగా నేటికీ స్కూళ్ళు, కాలేజీలు తెరిచే అవకాశం లేకపోవడంతో ఊహించినట్లే ఆ ప్రభావం విద్యాసంవత్సరంపై పడింది. తరగతులు ఆలస్యంగా మొదలవుతున్నందున ఈ ఏడాది విద్యాసంవత్సరం కుదించక తప్పడంలేదు. ఇంటర్మీడియెట్‌లో సాధారణంగా తరగతులు, పరీక్షల నిర్వహణ కలిపి ఏడాదికి 220 రోజులు జరుగుతాయి. కానీ ఈ ఏడాది 182 రోజులలోనే అన్నీ ముగించాలని తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డు నిర్ణయించి ఈమేరకు 2020-21 విద్యాసంవత్సరం క్యాలెండర్‌ను  విడుదల చేసింది. ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాల ప్రక్రియకు బోర్డు షెడ్యూల్ ప్రకటించిన తరువాతే ప్రైవేట్ జూనియర్ కాలేజీలు ప్రవేశాలు చేపట్టాలని ముందుగా ఎటువంటి ప్రకటనలు ఇచ్చినా కటినచర్యలు తీసుకొంటామని ఇంటర్మీడియెట్ బోర్డు హెచ్చరించింది.  

2020-2021 విద్యాసంవత్సరం క్యాలెండర్

మొత్తం పనిదినాలు

182

తరగతులు ప్రారంభం

1-9-2020

దసరా శలవులు

23-10-2020 నుంచి 25-10-2020

సంక్రాంతి శలవులు

2021, జనవరి 13, 14

ప్రీ-ఫైనల్ పరీక్షలు

22-2-2021 నుంచి 27-2-2021

ప్రాక్టికల్ పరీక్షలు (హ్యూమానిటీస్, మొదటి సం.లో హాజరు తక్కువున్న వారికి తరగతులు

1-3-2021 నుంచి 20-3-2021

వార్షిక పరీక్షలు

24-3-2021 నుంచి 12-4-2021

కాలేజీలకు చివరి పనిదినం

16-4-2021

వేసవి సెలవులు

17-4-2021 నుంచి 31-5-2021

అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు

మే చివరి వారంలో

కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం

1-6-2021

Related Post