సెప్టెంబర్ 12 నుంచి పాలిటెక్నిక్ ప్రవేశాలు

September 10, 2020
img

రాష్ట్రంలో పాలిటెక్నిక్ ఎంట్రెన్స్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను అధికారిక www.polycetts.nic.in వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చునని సాంకేతిక విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఫలితాలు ప్రకటించినందున ఈ నెల 12 నుంచి మొదటి విడత పాలిటెక్నిక్ కాలేజీలలో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమవుతుంది. 

ప్రవేశ ప్రక్రియ షెడ్యూల్ ఈవిధంగా ఉంది: 

• (మొదటి విడత) సర్టిఫికెట్లు, దృవీకరణ పత్రాల పరిశీలనకు స్లాట్ బుకింగ్: సెప్టెంబర్ 12 నుంచి 17వరకు.   

• సర్టిఫికెట్లు, దృవీకరణ పత్రాల పరిశీలన: ఈ నెల 14 నుంచి 18 వరకు  

• వెబ్‌ ఆప్షన్స్: ఈనెల 14 నుంచి 20 వరకు

• సీట్ల కేటాయింపు: సెప్టెంబర్ 22న

• ట్యూషన్ ఫీజు చెల్లింపు: సెప్టెంబర్ 22 నుంచి 26వరకు 

• కాలేజీకి హాజరు కావలసిన తేదీ (రిపోర్టింగ్): సెప్టెంబర్ 22 నుంచి 26 వరకు

• (తుది విడత) ప్రవేశ ప్రక్రియ: సెప్టెంబర్ 30న

• వెబ్‌ ఆప్షన్స్: అక్టోబర్ 1న

• సీట్ల కేటాయింపు: అక్టోబర్ 3న 

• తరగతులు ప్రారంభం: అక్టోబర్ 7 నుంచి 

• అక్టోబర్ 8వ తేదీన ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీలలో ప్రవేశాలకు మార్గదర్శకాలు జారీ.

Related Post