తెలంగాణలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలు ఖరారు

August 10, 2020
img

తెలంగాణ ఉన్నత విద్యామండలి ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలను సోమవారం ఖరారు చేసింది. ఈనెల 31న ఈసెట్, సెప్టెంబర్ 2న పాలిసెట్, సెప్టెంబర్ 9,10,11,14 తేదీలలో ఎంసెట్ ఇంజనీరింగ్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. హైకోర్టు అనుమతిస్తే ఒకటిరెండు రోజుల్లో అధికారికంగా పరీక్షల తేదీలను ప్రకటిస్తుంది. అగ్రికల్చర్ ఎంసెట్, లాసెట్, పీజీ ఈసెట్, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సెట్, ఐసెట్, పీఈసెట్ తదితర పరీక్షల తేదీలను కూడా త్వరలో ఖరారు చేయనుంది. పరీక్షల నిర్వహణకు తోడ్పాటునందించే టీసీఎస్ స్లాట్స్‌ను బట్టి పరీక్షల తేదీలను ఖరారు చేయాలని ఉన్నతవిద్యామండలి నిర్ణయించింది. ఇవాళ్ళ ఖరారు చేసిన ఉమ్మడి పరీక్షల తేదీలను హైకోర్టుకు తెలియజేసి అనుమతి పొందాలని నిర్ణయించింది.      


Related Post