త్వరలో తెలంగాణ ఇంటర్ ఫలితాలు

June 02, 2020
img

తెలంగాణ ఇంటర్మీడియెట్ పరీక్షా  ఫలితాలను ప్రకటించడానికి ఇంటర్మీడియెట్ బోర్డు సన్నాహాలు చేస్తోంది. ఇంటర్ ప్రధమ, ద్వితీయ పరీక్ష పత్రాల మూల్యాంకనం పూర్తవడంతో ఈ నెల 15వ తేదీన ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలు, ఈ నెల 20వ తేదీన ఇంటర్ ప్రధమ సంవత్సరం పరీక్షా ఫలితాలను ప్రకటించేందుకు సిద్దం అవుతోంది. గత ఏడాది పరీక్షా ఫలితాల ప్రకటనలో ఏర్పడిన గందరగోళం కారణంగా రాష్ట్రంలో 26 మంది ఇంటర్ విద్యార్దులు ఆత్మహత్యలు చేసుకోవడం, దాంతో సిఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు మళ్ళీ ప్రధమ, ద్వితీయ అన్ని పరీక్షా పత్రాలను మూల్యాంకనం చేయవలసివచ్చింది. ఈసారి మళ్ళీ అటువంటి పొరపాట్లు జరుగకుండా ఇంటర్ బోర్డు అన్ని జాగ్రత్తలు తీసుకొంది. 


Related Post