తెలంగాణ 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ జారీ

May 22, 2020
img

లాక్‌డౌన్‌ కారణంగా వాయిదాపడిన 10వ తరగతిలో మిగిలిన 10 పరీక్షల షెడ్యూల్ తెలంగాణ విద్యాశాఖ శుక్రవారం మధ్యాహ్నం జారీ చేసింది. ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “హైకోర్టు ఆదేశాల మేరకు పరీక్షా కేంద్రాలలో విద్యార్దుల మద్య భౌతిక దూరం పాటిస్తూ, అన్ని జాగ్రత్తలు తీసుకోంటూ 10వ తరగతి పరీక్షలు నిర్వహించబోతున్నాము. జూన్ 8వ తేదీ నుంచి జూలై 5వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తాము. వీటి కోసం మొత్తం 4,535 పరీక్షా కేంద్రాలను సిద్దం చేస్తున్నాము. ఈ పరీక్షల నిర్వహణలో ఉపాధ్యాయులతో పాటు అదనంగా మరో 26,422 ప్రభుత్వ ఉద్యోగులు కూడా పాల్గొంటారు,” అని చెప్పారు. 

విద్యార్దులు పాత హాల్ టికెట్స్ నే చూపి పరీక్షలు వ్రాయవచ్చు. విద్యార్దులకు కరోనా లక్షణాలు ఉంటే  పరీక్షలకు హాజరయ్యేందుకు అనుమతించరు. తప్పనిసరిగా అందరూ మాస్కూలు ధరించి రావాలి. పరీక్ష కేంద్రాలలో తోటి విద్యార్దులతో గుమిగూడరాదు. తప్పనిసరిగా భౌతిక దూరం పాటించాలి.  

పరీక్షల టైమ్ టేబిల్: 

తేదీ/ రోజు

పరీక్ష

సమయం

08/06/2020        (సోమవారం)

ఆంగ్లం మొదటి పేపర్

ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 12.15 గంటల వరకు

11/06/2020         (గురువారం)

ఆంగ్లం రెండవ పేపర్

ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 12.15 గంటల వరకు

14/06/2020           (ఆదివారం)

గణితం మొదటి పేపర్

ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 12.15 గంటల వరకు

17/06/2020          (బుదవారం)

గణితం రెండవ పేపర్

ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 12.15 గంటల వరకు

20/06/2020

(శనివారం)

సామాన్య శాస్త్రం మొదటి పేపర్ (భౌతిక శాస్త్రం)

ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 12.15 గంటల వరకు

23/06/2020

(మంగళవారం)

సామాన్య శాస్త్రం రెండవ పేపర్ (జీవ శాస్త్రం)

ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 12.15 గంటల వరకు

26/06/2020

(శుక్రవారం)

సాంఘిక శాస్త్రం మొదటి పేపర్

ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 12.15 గంటల వరకు

29/06/2020

(సోమవారం)

సాంఘిక శాస్త్రం రెండవ పేపర్

ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 12.15 గంటల వరకు

02/07/2020

(గురువారం)

ఓరియంటల్ మెయిన్ లాంగ్వేజ్ (మొదటి పేపర్) (సంస్కృతం మరియు అరబిక్)  

ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 12.45 గంటల వరకు

05/07/2020

(ఆదివారం)

ఓరియంటల్ మెయిన్ లాంగ్వేజ్ (రెండవ పేపర్) (సంస్కృతం మరియు అరబిక్)

ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 12.45 గంటల వరకు

05/07/2020

(ఆదివారం)

ఒకేషనల్ కోర్సు (థియరీ)

ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 11.30 గంటల వరకు

Related Post