10వ తరగతి పరీక్షలకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్

May 19, 2020
img

తెలంగాణలో  10వ తరగతి పరీక్షల నిర్వహణకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది. పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌పై నేడు విచారణ చేపట్టిన హైకోర్టు, జూన్ 3వ తేదీన మరోసారి రాష్ట్రంలో పరిస్థితులను సమీక్షించిన తరువాత కరోనాతో సమస్య రాదనుకొంటే మొదటి వారంలో పరీక్షలు నిర్వహించుకోవచ్చునని తెలిపింది. విద్యార్దులకు కరోనా సోకకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ఎట్టి పరిస్థితులలో అలసత్వం ప్రదర్శించవద్దని సూచించింది. 

మార్చి నెలలో 10వ తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నప్పుడు రాష్ట్రంలో కరోనా వైరస్‌ ప్రవేశించడంతో హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన 8 పరీక్షలను వాయిదా వేసింది. ఇప్పుడు హైదరాబాద్‌లో కంటోన్మెంట్ జోన్లో మినహా రాష్ట్రమంతటా గ్రీన్‌ జోన్‌గా ప్రకటించినందున 10వ తరగతి పరీక్షల నిర్వహణకు ఎస్ఎస్సీ బోర్డు సిద్దమవుతోంది. పరీక్షల నిర్వహణకు హైకోర్టు ఆమోదం లభించింది కనుక త్వరలోనే పరీక్షల షెడ్యూల్ ప్రకటన వెలువడవచ్చు. 


Related Post