తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు షాక్

March 12, 2020
img

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. 2012లో ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం 380 మంది సబ్ ఇంజనీర్ల నియామకానికి నోటిఫికేషన్‌ ఇచ్చి ఎంపిక చేసింది. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి టిఆర్ఎస్‌ అధికారంలోకి వచ్చిన తరువాత గత ప్రభుత్వం ఇచ్చిన ఆ జీవోను రద్దు చేస్తూ 2015లో మరో జీవో జారీ చేసింది. దానిపై సబ్ ఇంజనీర్లుగా ఎంపికైనవారు హైకోర్టును ఆశ్రయించగా నేడు దానిపై తుది తీర్పు వెలువడింది. 2015లో టిఆర్ఎస్‌ ప్రభుత్వం జారీ చేసిన ఆ జీవోను కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది. 2012లో ఎంపికైన 380 మంది సబ్ ఇంజనీర్లను ట్రాన్స్ కో తక్షణమే ఉద్యోగాలలోకి తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో గత 8 ఏళ్లుగా న్యాయపోరాటం చేసి అలిసిపోయున్న 380 మందికి త్వరలో ఉద్యోగాలు లభించనున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ఆ నియామకాలలో ఏపీకి చెందినవారు కూడా ఉంటారు కనుక వారిని ఉద్యోగాలలోకి తీసుకొనేందుకు తెలంగాణ ప్రభుత్వం అంగీకరించకపోవచ్చు. కనుక ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేసినట్లయితే మళ్ళీ వారందరూ సుదీర్గమైన న్యాయపోరాటం చేయకతప్పదు.


Related Post