నిరుద్యోగులకు సాంకేతిక శిక్షణ

March 12, 2020
img

నిరుద్యోగ యువత వివిద రంగాలలో ఉద్యోగాలు లేదా స్వయం ఉపాది పొందేందుకు రాజేంద్రనగర్‌లోని బ్యాంకర్ల గ్రామీణ, ఔత్సాహికుల అభివృద్ధి సంస్థ 40 రోజులు ఉచిత శిక్షణ ఇస్తోంది. ఏప్రిల్ 3వ తేదీ నుంచి మే 12 వరకు ఈ శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తారు. యువకులకు సెల్ ఫోన్‌, లాప్‌టాప్ రిపేరింగ్, పిసి హార్డ్ వేర్, ఎలక్ట్రీషియన్, పంప్‌సెట్ రిపేర్, నెట్‌వర్కింగ్, ఎంఎస్ ఆఫీస్, డీటీపీలలో శిక్షణ ఇస్తారు. యువతులకు ఎంఎస్ ఆఫీస్, డీటీపీ, ఫ్యాషన్ డిజైనింగ్, మగ్గం వర్క్స్ (జర్దోసి), ఆర్‌ఈడీపిలలో శిక్షణ ఇస్తారు.

 వీటిలో శిక్షణ పొందడానికి కనీస విద్యార్హత 10వ తరగతి పాస్ అయ్యుండాలి. జీఎస్టీ, అకౌంటింగ్ ప్యాకేజీ, ట్యాలీ శిక్షణకు  కనీస విద్యార్హత బీకాం పాస్ అయ్యుండాలి. శిక్షణకు ఎంపికైన అభ్యర్ధులకు 40 రోజులు ఉచిత భోజన,వసతి సౌకర్యాలు కల్పిస్తారు. శిక్షణ పూర్తి చేసిన అభ్యర్ధులకు సర్టిఫికేట్, బస్సు, రైలు ఛార్జీలు కూడా ఇస్తారు. ప్రస్తుతం చదువుకొంటున్న విద్యార్దులు ఈ శిక్షణ కార్యక్రమానికి అర్హులు కారు. అర్హత, ఆసక్తి గలవారు http://www.bired.org/apbiredApplicationFrm.php వెబ్‌సైట్‌ ద్వారా మార్చి 12 నుంచి 22లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. శిక్షణకు ఎంపికైనవారికి ఫోన్‌ ద్వారా సమాచారం ఇవ్వబడుతుంది. 

Related Post