మార్చి 16 నుంచి రాష్ట్రంలో ఒంటిపూట బడులు

March 11, 2020
img

ఈనెల 16వ తేదీ నుంచి రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలకు ఒంటిపూట బడులు ప్రారంభం అవుతాయని విద్యాశాఖ కమీషనర్ చిత్రా రామచంద్రన్ ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పాఠశాలలు పనిచేస్తాయని తెలిపారు. ఏప్రిల్ 23వ తేదీ నుంచి జూన్ 11వరకు పాఠశాలలకు వేసవి శలవులుగా ప్రకటించారు. ఒంటిపూట బదులు మొదలైనప్పటి నుంచి విద్యార్దులను మధ్యాహ్నం భోజనం చేసిన తరువాత ఇళ్లకు పంపించాల్సి ఉంటుందని విద్యాశాఖ కమీషనర్ చిత్రా రామచంద్రన్ సూచించారు.    


Related Post