నేడు పాతబస్తీలో ఎల్&టి ఉద్యోగాల భర్తీ

January 22, 2020
img

మీరు ఐ‌టిఐలో ఫిట్టర్, వెల్డర్ లేదా డ్రాఫ్ట్‌మెన్‌ సివిల్‌ శిక్షణ పూర్తి చేసుకొన్నారా? అయితే ఇది మీ కోసమే. ఎల్&టి సంస్థ బుదవారం ఉదయం హైదరాబాద్‌ పాతబస్తీలో గల ఐ‌టిఐలో ఈ మూడు కోర్సులలో శిక్షణ పూర్తి చేసుకొన్నవారిని భర్తీ చేసుకోబోతోంది. ఈరోజు ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇంటర్వ్యూలు కొనసాగుతాయి. ఐ‌టిఐలో ఫిట్టర్, వెల్డర్ లేదా డ్రాఫ్ట్‌మెన్‌ సివిల్‌ కోర్సులలో ఏదైనా పూర్తిచేసి 18 నుంచి 35 సం.లలోపు వయసున్నవారు అర్హులని ఓల్డ్‌ సిటీ ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపల్ ఎస్.రేణుక తెలిపారు. ఎంపికైన అభ్యర్ధులకు నెలకు రూ.11,000 జీతం, ఉచిత భోజన సౌకర్యం ఉంటుందని తెలిపారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధులు ఈ ఇంటర్వ్యూలకు హాజరుకావచ్చునని తెలిపారు. ఇంటర్వ్యూలకు హాజరయ్యేవారు తమ ఒరిజినల్ సర్టిఫికెట్స్, వాటి జిరాక్స్ కాపీలు, ఆధార్ లేదా మరేదైనా గుర్తింపు కార్డు, పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు తప్పకుండా తీసుకొని రావాలని ఆమె తెలిపారు. ఈ ఉద్యోగాలు, ఇంటర్వ్యూలకు సంబందించి పూర్తి వివరాల కోసం 99481 74657 ఫోన్‌ నెంబరులో సంప్రదించవచ్చన్నారు.

దేశవిదేశాలలో భారీ ప్రాజెక్టులు నిర్మిస్తున్న ఎల్&టి సంస్థ గురించి కొత్తగా చెప్పుకోవలసిన అవసరం లేదు. అటువంటి సంస్థలో ఉద్యోగం లభిస్తే భవిష్యత్‌లో మంచి జీతభత్యాలు, సౌకర్యాలు అన్నీ లభించే అవకాశం ఉంటుంది. పైగా ఎల్&టి సంస్థలో ఉద్యోగానుభవం భవిష్యత్‌లో ఎంతో ఉపయోగపడుతుంది కూడా. ఇవాళ్ళ ఒక్కరోజు మాత్రమే ఎల్&టి సంస్థ నేరుగా ఉద్యోగాల భర్తీ చేసుకొంటోంది. ఇటువంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు కనుక అర్హులైన అభ్యర్ధులు తప్పకుండా ఈ ఇంటర్వ్యూలకు హాజరవడం చాలా మంచిది.

Related Post