గంజాయి వ్యాపారంలో హైదరాబాద్‌ జెఎన్‌టియు విద్యార్ధులు?

January 10, 2020
img

హైదరాబాద్‌ జెఎన్‌టియు విద్యార్దులలో కొందరు తమ ఆర్ధికావసరాలను తీర్చుకోవడానికో లేదా మత్తుమందులకు అలవాటు పడినందునో గంజాయి వ్యాపారం చేస్తుండటం ఆందోళనకరమైన విషయమే. గత నెల 24వ తేదీన ఇద్దరు జెఎన్‌టియు విద్యార్దులు గంజాయి విక్రస్తుండగా ఉప్పల్ పోలీసులకు పట్టుబడ్డారు. అంతవరకు ఈవిషయం జెఎన్‌టియు యాజమాన్యానికి తెలియకపోవడం విచిత్రమే. కానీ తెలిసినవెంటనే ఒక కమిటీని ఏర్పాటు చేసి హాస్టల్లో ఇంకా గంజాయి వ్యాపారం చేస్తున్నవారిని గుర్తించింది. మొత్తం 11 మంది విద్యార్ధులు గంజాయి వ్యాపారం చేస్తున్నట్లు గుర్తించడంతో వారిని హాస్టల్ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు జెఎన్‌టియు ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ సాయిబాబా రెడ్డి ప్రకటించారు. 


Related Post