హైదరాబాద్‌లో మినీ జాబ్‌మేళా

January 08, 2020
img

జనవరి 10వ తేదీన హైదరాబాద్‌ లోయర్ ట్యాంక్ బండ్ ఏఆర్‌క్‌ సౌల్యూషన్స్ లో మినీ జాబ్‌మేళా జరుగబోతోంది. 19 నుంచి 35 ఏళ్ళు లోపు వయసు కలిగి, 10వ తరగతి, ఇంటర్మీడియెట్, ఐ‌టిఐ, డిప్లోమా, డిగ్రీ, బీటెక్, పీజీ, ఎంబీఏ, బీఫార్మసీ, డీఫార్మసీ, ఎంఫార్మసీ చదివిన అభ్యర్ధులు ఈ ఉద్యోగాలకు అర్హులు. 

పేటీఎం, ఎల్ఐసీ లిమిటెడ్, అపోలో ఫార్మసీ, బయోకేర్ మెడికల్ సిస్టమ్స్, సన్‌ప్లవర్‌ సేల్స్‌ డిస్ట్రిబ్యూషన్స్‌,కాలిట్ హెచ్ఆర్, హిందూజా గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్, ఐడిబిఐ ఫెడరల్, వేగారియాస్‌ సొల్యూషన్స్‌ తదితర కంపెనీలు ఈ మినీ జాబ్‌మేళాలో పాల్గొని సుమారు 1,000 ఉద్యోగాలు భర్తీ చేసుకొనున్నాయి. ఉద్యోగాలు, అభ్యర్ధుల అర్హత, అనుభవాన్ని బట్టి రూ.10,000 నుంచి 20,000 వరకు జీతం లభిస్తుంది. కనుక తగిన అర్హతలు, ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువతీయువకులు టి.రఘుపతి: 82476 56356, 88868  84049 నంబర్లలో సంప్రదించి ఉద్యోగాలకు సంబందించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. అభ్యర్ధులు తమ ఒరిజినల్ సర్టిఫికేట్లు, వాటి జిరాక్సు కాపీలు, పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు, ఆధార్ లేదా మరేదైనా గుర్తింపు కార్డుతో జనవరి10వ తేదీన హైదరాబాద్‌ లోయర్ ట్యాంక్ బండ్ ఏఆర్‌క్‌ సౌల్యూషన్స్ లో ఇంటర్వ్యూలకు హాజరుకావచ్చు.

Related Post