అటవీశాఖలో ఉద్యోగాల భర్తీలో వివాదం

December 13, 2019
img

తెలంగాణ అటవీశాఖలో బీట్ ఆఫీసర్ల భర్తీ విషయంలో మళ్ళీ వివాదం తలెత్తేలా ఉంది. అటవీశాఖలో  మొత్తం 1,313 బీట్ ఆఫీసర్ల పోస్టులలో 1,282 పోస్టులను టీఎస్‌పీఎస్సీ ద్వారా భర్తీ అయ్యాయి. కానీ వాటిలో 875 మంది మాత్రమే విధులలో చేరగా మిగిలిన 324 మంది విధులలో చేరలేదు. కొందరు విధులలో చేరి ఉద్యోగం నచ్చక రాజీనామాలు చేయగా, కొందరు వేరే ప్రభుత్యోగాలకు ఎంపికవడంతో రాజీనామాలు చేశారు. మరికొందరు విధులలో చేరకపోవడానికి ఎటువంటి కారణాలు చెప్పలేదు. కనుక మొత్తం 324 ఖాళీలు మిగిలిపోయాయి. కనుక  ఈ పోస్టుల కోసం ఇదివరకు నిర్వహించిన పరీక్షలలో ఉత్తీర్ణులైనవారి మెరిట్ జాబితాలో మిగిలినవారితో ఆ ఉద్యోగాలను భర్తీ చేయాలని టీఎస్‌పీఎస్సీ నిర్ణయించింది. అయితే హైకోర్టు ఆదేశాల ప్రకారం ఆవిధంగా మిగిలిపోయిన బ్యాక్‌లాగ్ ఉద్యోగాలను మెరిట్ జాబితాలో అభ్యర్ధులతో భర్తీ చేయకూడదు. కానీ భర్తీ చేయాలని టీఎస్‌పీఎస్సీ నిర్ణయించడంతో కొందరు అభ్యర్ధులు అభ్యంతరాలు తెలుపుతూ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. కనుక ఈ ఉద్యోగాల భర్తీపై హైకోర్టు ఏమి చెపుతుందో చూడాలి.              


Related Post