ఇక నుంచి రోజుకు 9 గంటలు పనిగంటలు

November 19, 2019
img

అనూహ్యమైన నిర్ణయాలను అమలుచేస్తున్న కేంద్రప్రభుత్వం తాజాగా కార్యాలయాలు, కర్మాగారాలలో పనిగంటలు పెంచాలని నిర్ణయించింది. కార్మిక చట్టాల పరిధిలోకి వచ్చే ఉద్యోగులు, కార్మికులు ఇక నుంచి రోజుకు 8 గంటలకు బదులు 9 గంటలు పనిచేసేలా నిబందనలు రూపొందించి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అయితే పని గంటలు పెంచినప్పటికీ ఆ మేరకు వేతనాలు పెంచడమో లేదా వారానికి ఒక రోజు బదులు రెండు రోజులు వారాంతపు శలవులు ఇచ్చే ప్రతిపాదన ఏదీ చేయకపోవడం విశేషం. కొత్తగా రూపొందించిన వేతన కోడ్-2019లో భవిష్యత్‌లో జీతాల పెంపు, డీఏ, హెచ్ఆర్ఏ పెంపుకు సంబందించి ఆరు కొలమానాలను తప్ప మిగిలినవన్నీ పాత నిబందనల ప్రకారమే ఉన్నాయి సవరించిన ఈ నిబందనలపై ఉద్యోగులు, కార్మికులు, వారి సంఘాలు ఈ నెలాఖరులోగా తమ అభిప్రాయాలను తెలియజేయవలసిందిగా కేంద్రప్రభుత్వం కోరింది.తమ అభ్యంతరాలను rajiv.ranja76@gov.in లేదా malick.bikash@gov.in లకు ఈమెయిల్స్ ద్వారా తెలియజేయవచ్చు. 


Related Post