కానిస్టేబుల్ నియామకాలపై హైకోర్టులో పిటిషన్‌

October 01, 2019
img

తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించిన పరీక్షలలో ఉత్తీర్ణులైన వారి జాబితాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ పరీక్షలకు హాజరైన అభ్యర్ధులు కొందరు ఆ జాబితాపై అభ్యంతరం తెలుపుతూ మంగళవారం హైకోర్టులో ఒక పిటిషన్‌ వేశారు. తమకు కటాఫ్ మార్క్స్ కంటే ఎక్కువ మార్కులే వచ్చినప్పటికీ తమకు ఉద్యోగాలు ఇవ్వకుండా పక్కనపెట్టి తమ కంటే తక్కువ మార్కులు వచ్చిన వారికి ఉద్యోగాలు ఇచ్చారని వారు తమ పిటిషనులో ఫిర్యాదు చేశారు. దానిని విచారణకు స్వీకరించిన న్యాయస్థానం, అక్టోబర్ 15కు ఈ కేసును వాయిదా వేసింది. ఆలోగా కానిస్టేబుల్ నియామకాలకు సంబందించి పూర్తి వివరాలను కోర్టుకు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కనుక మళ్ళీ నియామక ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్లే భావించవచ్చు. మొత్తం 16,926 పోస్టులకు పరీక్షలు నిర్వహించగా వారిలో 90,000 మంది ఉత్తీర్ణులయ్యారు. మళ్ళీ వారిలో మెరిట్ ఆధారంగా వడపోత జరిపి ఇటీవలే ఆ జాబితాను ప్రకటించింది.   

Related Post