శభాష్ హైదరాబాద్‌ పోలీస్...రేపు జాబ్ మేళా

September 27, 2019
img

పోలీసులను చూస్తే నేరగాళ్ళు భయపడాలి కానీ సామాన్య ప్రజలు కాదు. వారు తమ సేవలను గుర్తించి, గౌరవించాలని...ఆదరించాలని ఏ పోలీస్ అయినా కోరుకొంటారు. ఇదే ఆలోచనతో తెలంగాణ పోలీస్ శాఖ  ప్రజలకు చేరువయ్యేందుకు ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని అమలులోకి తెచ్చింది. దానిలో భాగంగానే జాబ్-కనెక్ట్ పేరుతో చాలా కాలం క్రితమే ఓ కార్యక్రమం ప్రారంభించింది. దానిద్వారా రాష్ట్రంలో పలు ప్రైవేట్ కంపెనీలకు రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు మద్య వారధిగా నిలుస్తోంది.

హైదరాబాద్‌ ఈస్ట్ జోన్ పరిధిలో గల సైదాబాద్ పోలీస్ స్టేషన్‌ అధ్వర్యంలో రేపు అంటే శనివారం జాబ్ మేళా నిర్వహిస్తోంది. చంపాపేటలోని లక్ష్మీ గార్డెన్స్‌లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మెగా జాబ్ కనెక్ట్ పేరుతో జాబ్ మేళా నిర్వహించబోతోంది. దీనిలో 20 ప్రముఖ ప్రైవేట్ కంపెనీలు పాల్గొని 3,000 ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నాయి. 10వ తరగతి ఫెయిల్ అయినవారు మొదలు డిగ్రీ పాసైనవారి వరకు అందరికీ తగిన ఉద్యోగావకాశాలు ఉన్నాయని ఈస్ట్ జోన్ ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాస్ తెలిపారు. దీనిలో ప్రవేశం, రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ అన్ని ఉచితం. కనుక నిరుద్యోగ యువతీయువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని శ్రీనివాస్ కోరారు.

ఈ మేళాలో పాల్గొనాలనుకొంటున్న అభ్యర్ధులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు, వాటి జిరాక్సు కాపీలు, పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు, ఆధార్ లేదా ఏదైనా గుర్తింపు కార్డు వగైరాలతో హాజరుకావలసి ఉంటుంది. ఈ జాబ్ మేళాకు సంబందించి మరిన్ని వివరాల కోసం 040-27854785 లేదా 9490616391 నెంబర్లకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. ఈ జాబ్ మేళాను ఈస్ట్ జోన్ డిసిపి, నగర జాయింట్ కమీషనర్ రమేశ్ రెడ్డి ప్రారంభిస్తారు. 

Related Post