రెండు గ్రామాల నుంచి 18 మంది పోలీస్ ఉద్యోగాలకు ఎంపిక

September 26, 2019
img

తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు మంగళవారం ప్రకటించిన పోలీస్ ఉద్యోగాల ఫలితాలలో కరీంనగర్‌ జిల్లా మానకొండూర్ మండలంలో పరిధిలోని చెంజెర్ల గ్రామానికి చెందిన 11 మంది యువకులు ఎంపిక అయ్యారు. వారందరూ దిగువ మద్యతరగతి కుటుంబాలకు చెందినవారే. అందరూ పట్టుదలగా కృషి చేసి కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపిక అయ్యారు


అలాగే వీణవంక మండలంలోని మామిడాలపల్లి గ్రామానికి చెందిన ఏడుగురు యువకులు పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. 

చెంజెర్ల గ్రామం నుంచి ఉద్యోగాలకు ఎంపికైన వారి పేర్లు: బిల్ల సాయికుమార్, మేకల కుమార్, గాలి అజయ్ కుమార్, బొమ్మెన రమేష్, కానిగంటి మహేష్, బొల్ల సతీష్, మద్ది అనిల్, ర్‌ అనిల్, లక్కర్సు వంశీకృష్ణ, పోతరాజు రాజేందర్.   

మామిడాలపల్లి గ్రామం నుంచి ఎంపికైనవారి పేర్లు: సింగరవేణి వంశీ, పూసాల వంశీ, నారాయణదాసు అశ్విని, నారాయణదాసు ప్రశాంత్, పూసాల పద్మ, మ్యాకల రాజు, కోట అరుణ్‌కుమార్.

Related Post