మెడికల్ కౌన్సిలింగ్‌కు హైకోర్టు క్లియరెన్స్

August 20, 2019
img

రాష్ట్రంలో మొదటి విడత మెడికల్ కౌన్సిలింగ్ ప్రక్రియ పూర్తయిన తరువాత కొందరు విద్యార్దులు అభ్యంతరాలు తెలుపుతూ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల కోటాను సక్రమంగా అమలుచేయడం లేదని ఫిర్యాదు చేయడంతో హైకోర్టు రెండవ విడత కౌన్సిలింగ్‌పై స్టే విధించింది. సోమవారం ఈ కేసుపై విచారణ జరిపిన హైకోర్టు ఇరు పక్షాల వాదనలు విన్న తరువాత విద్యార్దుల వాదన సరికాదని చెపుతూ వారి పిటిషన్‌ను కొట్టివేసింది. రెండవ విడత మెడికల్ కౌన్సిలింగ్‌పై విధించిన స్టేను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 2వ తేదీ నుంచి శిక్షణా తరగతులు మొదలవవలసి ఉంది కనుక వెంటనే కౌన్సిలింగ్ ప్రక్రియను ప్రారంభించడానికి కాళోజీ యూనివర్సిటీ అధికారులు సిద్దం అవుతున్నారు. 


Related Post