తెలంగాణ యూనివర్శిటీలకు ఇన్-ఛార్జ్ వీసీలుగా ఐఏఎస్ అధికారులు!

July 24, 2019
img

తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకొంది. నేటితో రాష్ట్రంలో 8 యూనివర్శిటీల వైస్-ఛాన్సిలర్ల పదవీకాలం ముగియడంతో 8 మంది ఐఏఎస్ అధికారులను యూనివర్శిటీలకు ఇన్-ఛార్జ్ వీసీలుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 

ఉస్మానియా యూనివర్సిటీ - అరవింద్ కుమార్ 

కాకతీయ యూనివరర్సిటీ - జనార్థన్ రెడ్డి

జేఎన్టీయూ - జయేష్ రంజన్

అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ - పార్థసారధి

మహాత్మాగాంధీ యూనివర్సిటీ - పీఎస్ఆర్

పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ - అనిల్ కుమార్

పాలమూరు యూనివర్సిటీ - రాహుల్ బొజ్జా

ప్రభుత్వంలో వివిదశాఖలో పాలనపరమైన విధులు నిర్వర్తిస్తున్న ఐఏఎస్ అధికారులను యూనివర్శిటీలకు ఇన్-ఛార్జ్ వీసీలుగా ఎందుకు నియమించిందో ప్రభుత్వం వివరణ ఇవ్వలేదు కానీ రేపటి నుంచి ఈ నిర్ణయంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించడం తధ్యం.

Related Post