తెలంగాణ ఎస్సై అభ్యర్ధుల జాబితా విడుదల

July 13, 2019
img

తెలంగాణ పోలీస్ శాఖలో ఎస్సై ఉద్యోగాలకు ఎంపిక అయిన 1,272 మంది అభ్యర్ధుల జాబితాను పోలీస్ శాఖ అధికారిక వెబ్‌సైట్‌ http://www.tslprb.in/  లో విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్ధులు తమ ఐడి, పాస్ వర్డ్ తో లాగిన్ అయ్యి తమ వివరాలను పరిశీలించుకోవచ్చు. ఈ తుది జాబితాపై ఎవరికైనా ఏవైనా సందేహాలున్నట్లయితే, నిర్ణీతఫీజును చెల్లించి నివృత్తి చేసుకోవచ్చునని పోలీస్ శాఖ నియామక మండలి అధికారులు తెలిపారు. ఎంపికైనవారిలో 992 మంది పురుషులు, 280 మంది మహిళలు ఉన్నారు. వీరందరికీ త్వరలోనే వైద్య పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటనలో పేర్కొంది.  


Related Post