పోలీస్ శాఖలో ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్‌?

June 26, 2019
img

తెలంగాణ పోలీస్ శాఖలో గత ఏడాది 18,428 పోస్టుల భర్తీకి చేపట్టిన ప్రక్రియ దాదాపు పూర్తికావచ్చింది. వారిని కూడా కలుపుకొంటే పోలీస్ శాఖలో మొత్తం 72,500 మంది అవుతారు. కానీ రాష్ట్ర జనాభాను బట్టి కనీసం 1,08,000 మంది పోలీసులు అవసరం ఉంది. కనుక త్వరలోనే మరొక 15,000 పోస్టుల భర్తీకి పోలీస్ శాఖ నోటిఫికేషన్‌ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. 

ఈసారి 33 జిల్లాల ప్రకారం నోటిఫికేషన్‌ విడుదల చేయాలని పోలీస్ శాఖ భావిస్తున్నందున, కొత్తగా ఏర్పాటు చేసిన ములుగు, నారాయణపేట జిల్లాలను గుర్తిస్తూ రాష్ట్రపతి నోటిఫికేషన్‌ జారీ చేయవలసి ఉంటుంది. ఒకవేళ ఉమ్మడి వరంగల్ జిల్లాను, మళ్ళీ వరంగల్, హన్మకొండ జిల్లాలుగా పునర్వ్యవస్థీకరించదలిస్తే వాటికి కూడా రాష్ట్రపతి ఆమోదముద్ర వేయవలసి ఉంటుంది. కనుక ఈ ప్రక్రియ పూర్తయ్యేలోగా నోటిఫికేషన్‌ విడుదలచేయడానికి ముందు అవసరమైన కసరత్తు పూర్తిచేయాలని పోలీస్ శాఖ భావిస్తోంది. త్వరలో విధులలో చేరనున్న 18,428 మంది పోలీస్ సిబ్బందితో సహా ప్రస్తుతం ఉన్న సిబ్బందిని 33 జిల్లాలలో సర్దుబాటు చేసి, అదనంగా ఏ జిల్లాకు ఎంతమంది సిబ్బంది కావాలో గుర్తించే పని మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఈ తతంగం అంతా పూర్తయి నోటిఫికేషన్‌ వెలువడటానికి ఒకటి రెండు నెలలు సమయం పట్టవచ్చు. 

Related Post