గ్రూప్-2 అభ్యర్ధులకు శుభవార్త

June 20, 2019
img

గ్రూప్‌-2 ఉద్యోగాలకు అర్హత సాధించిన అభ్యర్ధులకు ఒక శుభవార్త. ఇంటర్వ్యూల కోసం ఎంతకాలంగానో ఎదురుచూస్తున్న వారందరికీ టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ ఘంటా చక్రపాణి ఆ శుభముహూర్తం ప్రకటించారు. జూలై మొదటివారంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని తెలిపారు. ఆ ఇంటర్వ్యూలలో ఉత్తీర్ణులైన అభ్యర్ధుల జాబితాను విద్యాశాఖకు పంపించి ఆమోదం తీసుకొని వెంటనే అభ్యర్ధులకు నియామకపత్రాలు అందజేస్తామని చెప్పారు. గ్రూప్‌-2 ఇంటర్వ్యూలకు సుమారు 2,000 మంది అభ్యర్ధులు హాజరుకానున్నారు.  


Related Post