తెలంగాణ విద్యార్ధిని నీట్‌లో టాపర్

June 06, 2019
img

ఎంబీబీఎస్, డెంటల్ వైద్య కళాశాలలలో ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా జరిగిన జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్-2019)లో తెలంగాణకు చెందిన జి మాధూరీ రెడ్డి జాతీయస్థాయిలో 7వ ర్యాంక్ సాధించింది. బుదవారం విడుదలైన నీట్ ఫలితాలలో రాజస్థాన్‌ విధ్యార్ది నళిన్ ఖండేల్ వాల్ జాతీయస్థాయిలో ప్రధమస్థానం పొందాడు. నీట్‌లో 720 మార్కులకు అతను 701 మార్కులు సాధించగా మాధురీ రెడ్డి 695 మార్కులు సాధించింది. డిల్లీ విద్యార్ధి భావిక్ బన్సాల్‌, యూపీకి చెందిన అక్షత్ కౌశిక్ ఇద్దరికీ 700 మార్కులు సాధించినప్పటికీ వారిలో భావిక్ బన్సాల్‌కు అక్షయ్ కౌశిక్ కంటే జీవశాస్త్రంలో ఎక్కువ మార్కులు వచ్చినందున భావిక్ బన్సాల్‌కు ద్వితీయ ర్యాంక్, అక్షయ్ కౌశిక్‌కు3వ స్థానం కేటాయించారు. నీట్ పరీక్షలకు దేశవ్యాప్తంగా 14,10,755 మంది విద్యార్దులు హాజరుకాగా వారిలో 7,97,042 మంది అర్హత సాధించారు. నీట్ పరీక్షలకు ఈసారి ఐదుగురు నపుంసకులు హాజరుకాగా వారిలో ముగ్గురు అర్హత సాధించారు.     


Related Post