జూన్ 7నుంచి ఇంటర్ పరీక్షలు

June 05, 2019
img
జూన్ 7వ తేదీ నుంచి ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించబోతున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ తెలిపారు. ఇంటర్ మొదటి సం.పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ద్వితీయ సం.పరీక్షలు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహిస్తామని తెలిపారు. పరీక్షా సమయానికి నిమిషం ఆలస్యం అయినా లోనికి అనుమతించబోమని కనుక విద్యార్దులందరూ ముందుగానే పరీక్షాకేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. 
బెటర్మెంట్ పరీక్షలు వ్రాస్తున్నవారితో కలిపి మొత్తం 4,63,236 మంది విద్యార్దులు ఈ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరుకాబోతున్నారని అశోక్ తెలిపారు. విద్యార్దులందరికీ పోస్ట్ ద్వారా హాల్ టికెట్లు పంపించామని, ఒకవేళ ఎవరికైనా అందకపోతే ఆందోళన చెందకుండా www.bie.telangana.gov.in వెబ్‌సైట్‌ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చునని తెలిపారు. వాటిపై కాలేజీ ప్రిన్సిపాల్ సంతకాలు లేకపోయినా విద్యార్దులను పరీక్షలు వ్రాసేందుకు అనుమతిస్తామని తెలిపారు. ఇంటర్ పరీక్షలకు సంబందించి విద్యార్దులకు ఎటువంటి సమాచారం కావాలన్నా 040–24601010, 040–247 32369 ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చునని అశోక్ తెలిపారు. 

పరీక్షల టైమ్ టేబుల్ : 

తేదీ

ప్రధమ సంవత్సరం

ద్వితీయ సంవత్సరం

7/6/19

పార్ట్-2 సెకండ్ లాంగ్వేజ్ పేపర్-1

పార్ట్-2 సెకండ్ లాంగ్వేజ్ పేపర్-2

8/6/19

పార్ట్-1 ఇంగ్లీష్ పేపర్-1

పార్ట్-1 ఇంగ్లీష్ పేపర్-2

9/6/19

పార్ట్-3 గణితం పేపర్-1ఏ

పార్ట్-3 గణితం పేపర్-2

9/6/19

వృక్ష శాస్త్రం-పేపర్-1

వృక్ష శాస్త్రం-పేపర్-2

9/6/19

పౌర శాస్త్రం పేపర్-1

పౌర శాస్త్రం పేపర్-2

9/6/19

సైకాలజీ పేపర్-1

సైకాలజీ పేపర్-2

10/6/19

గణితం పేపర్-1బి

గణితం పేపర్-1బ2

10/6/19

జంతు శాస్త్రం-1

జంతు శాస్త్రం-2

10/6/19

చరిత్ర-1

చరిత్ర-2

11/6/19

భౌతిక శాస్త్రం పేపర్-1

భౌతిక శాస్త్రం పేపర్-2

11/6/19

అర్ధ శాస్త్రం పేపర్-1

అర్ధ శాస్త్రం పేపర్-1

11/6/19

క్లాసికల్ లాంగేవేజ్ పేపర్-1

క్లాసికల్ లాంగేవేజ్ పేపర్-2

12/6/19

రసాయన శాస్త్రం పేపర్ -1

రసాయన శాస్త్రం పేపర్-2

12/6/19

కామర్స్ పేపర్ -1

కామర్స్ పేపర్ -2

12/6/19

సోషియాలజీ పేపర్ -1

సోషియాలజీ పేపర్-2

12/6/19

ఫైనార్ట్స్, మ్యూజిక్ పేపర్ -1

ఫైనార్ట్స్, మ్యూజిక్ పేపర్ -2

13/6/19

జియాలజీ పేపర్ -1

జియాలజీ పేపర్-2

13/6/19

హోమ్ సైన్స్ పేపర్ -1

హోమ్ సైన్స్ పేపర్ -2

13/6/19

పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ -1

పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ -2

13/6/19

లాజిక్ పేపర్ -1

లాజిక్ పేపర్ -2

13/6/19

బ్రిడ్జి కోర్సు గణితం పేపర్ -1

(బైపీసీ విద్యార్దుల కోసం)

బ్రిడ్జి కోర్సు గణితం పేపర్-2

(బైపీసీ విద్యార్దుల కోసం)

14/6/19

మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-1

మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-2

14/6/19

జియోగ్రఫీ పేపర్-1

జియోగ్రఫీ పేపర్-2


Related Post