గ్రూప్-2 నియమకాలకు హైకోర్టు క్లియరెన్స్

June 03, 2019
img

న్యాయవివాదాల కారణంగా గత మూడేళ్లుగా నిలిపోయిన గ్రూప్-2 ఉద్యోగాల నియామక ప్రక్రియను ప్రారంభించడానికి  సోమవారం హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో ఎంపిక ప్రక్రియలో అనర్హులుగా పక్కన పెట్టిన 343 మంది అభ్యర్ధుల పత్రాలను పునః పరిశీలించి వారిలో అర్హులకు తదుపరి నియామక ప్రక్రియలో అవకాశం కల్పించాలని ఆదేశించింది. అలాగే సాంకేతిక కమిటీ సిఫార్సులను పరిగణనాలోకి తీసుకోవాలని ఆదేశించింది. 

ఒక్కో ఉద్యోగానికి ముగ్గురు అభ్యర్ధుల చొప్పున టీఎస్‌పీఎస్సీ ఇప్పటికే 3,147 మంది అర్హులైన అభ్యర్ధుల సర్టిఫికెట్లు పరిశీలన చేసి ఇంటర్వ్యూలకు పిలిచేందుకు సిద్దంగా ఉంది. హైకోర్టు ఆదేశాలే మేరకు గతంలో పక్కన పెట్టిన 343 మంది అభ్యర్ధుల పత్రాలను కూడా మరోసారి పరిశీలించి త్వరలోనే మెరిట్ జాబితాను, ఇంటర్వ్యూ తేదీలను ప్రకటిస్తామని టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ ఘంటా చక్రపాణి తెలిపారు. 


Related Post