పాఠశాలల వేసవి సెలవులు పొడిగింపు

May 25, 2019
img

తెలంగాణ రాష్ట్రంలో పాఠశాలల వేసవి సెలవులు పొడిగించబడ్డాయి. వాస్తవానికి జూన్ 1వ తేదీ నుంచి పాఠశాలలు తెరుచుకోవలసి ఉండగా, వేసవి ఎండల తీవ్రత దృష్ట్యా జూన్ 12వరకు వేసవి సెలవులను పొడిగించాలని సిఎం కేసీఆర్‌ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. జూన్ రెండవ వారంలోగా రాష్ట్రంలో వర్షాలు మొదలయ్యే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెపుతున్నారు కనుక పాఠశాలలు తెరిచేసరికి వాతావరణం కూడా చల్లబడుతుంది. ప్రభుత్వ నిర్ణయాన్ని విద్యార్దుల తల్లితండ్రులు, ఉపాద్యాయ సంఘాలు స్వాగతించాయి. 


Related Post