గురుకుల కళాశాలలో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ జారీ

May 20, 2019
img

తెలంగాణ రాష్ట్రంలో సాంఘిక, గిరిజన గురుకుల కళాశాలలో డిగ్రీ ప్రధమ సంవత్సంలో ప్రవేశాల కొరకు నోటిఫికేషన్‌ విడుదలైంది. వాటికి www.tgugcet/cgg.gov.in  వెబ్‌సైట్లో ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఈ నెల 22లోగా అంటే బుదవారంలోగా దరఖాస్తులు సమర్పించవలసి ఉంటుంది. రాష్ట్రంలో మొత్తం 30 సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలు, 22 గిరిజన సంక్షేమ గురుకుల కళాశాలలు ఉన్నాయి. ఇంటరులో కనీసం 40 శాతం మార్కులు వచ్చిన విద్యార్దులు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చునని గురుకుల కార్యదర్శి ప్రవీణ్ కుమార్ తెలిపారు. 

ప్రభుత్వ కళాశాలలో చదువుకొనేందుకు కూడా స్థోమతలేని నిరుపేద విద్యార్దులకు ఈ గురుకుల కళాశాలకు గొప్ప వరంగా చెప్పవచ్చు. ఈ కళాశాలలో చదువుకొనే విద్యార్దులకు ఒక్కోక్కరిపై ప్రభుత్వమే ఏడాదికి రూ.75,000 ఖర్చు చేస్తుంది. వివిద కారణాల చేత చదువులలో వెనుకబడిన విద్యార్దులకు ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తుంది. కనుక బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్దులు ఈ అవకాశాన్ని సద్వినియోగించుకోవడం మంచిది.

Related Post