టి-పాలిటెక్నిక్ షెడ్యూల్

May 15, 2019
img

తెలంగాణ రాష్ట్రంలో పాలిటెక్నిక్ కోర్సులలో ప్రవేశాలకు సంబందించి షెడ్యూల్ మంగళవారం విడుదలైంది. ఈ నెల 17 నుంచి 19లోగా విద్యార్దులు తమ పేర్లను  ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. అప్పుడే రిజిస్ట్రేషన్ ఫీజు కూడా చెల్లించి సర్టిఫికెట్ల పరీశీలనకు స్లాట్ (సమయం) ఫేస్‌బుక్‌లో చేసుకోవలసి ఉంటుంది. ఆ సమయం ప్రకారం ఈ నెల 18 నుంచి 21 వరకు విద్యార్దులు తమ సర్టిఫికెట్లను పరిశీలింపజేసుకోవాలి.

సర్టిఫికేట్ల పరిశీలనకు వెళ్ళేటప్పుడు విద్యార్దులు వెబ్‌సైట్‌లో పేర్కొన్న అన్ని సర్టిఫికెట్లను తప్పనిసరిగా తీసుకువెళ్ళాలి. వాటిలో ఒకటి లేకపోయినా వారి దరఖాస్తు తిరస్కరించబడుతుంది. అలాగే విద్యార్దులు తప్పనిసరిగా 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు, టీసీ, పాలిసెట్ ర్యాంక్ కార్డు, ఈ ఏడాది జనవరి 1వ తేదీ తరువాత జారీ చేయబడిన ఆదాయదృవ పత్రం, కుల, నివాస దృవపత్రాలను తప్పనిసరిగా వెంట తీసుకువెళ్ళాలి. రెగ్యులర్ విద్యార్దులు విద్యార్దులు కానివారు గత 7 ఏళ్ళ నుంచి ఒకే ప్రాంతంలో నివాసం ఉంటున్నట్లు దృవపత్రం సమర్పించవచ్చు. ఎస్సీ ఎస్టీ విద్యార్దులకు ప్రాసెసింగ్ ఫీజు రూ.300, ఇతరులు రూ.600 చెల్లించవలసి ఉంటుంది. ఆన్‌లైన్‌లో నెట్ బ్యాంకింగ్ ద్వారా లేదా డెబిట్ కార్డు ద్వారా ఫీజు చెల్లించవచ్చు. 

తరువాత 18 నుంచి 24 రాత్రి 12 గంటలలోగా వెబ్‌ ఆప్షన్స్  ఇచ్చుకోవచ్చు. ఈ నెల 27వ తేదీ నుంచి విద్యార్దులకు సీట్ల కేటాయింపు జరుగుతుంది. సీట్లు పొందిన విద్యార్దులు ఈ నెల 28 నుంచి 31లోగా ఆన్‌లైన్‌ ద్వారా ట్యూషన్ ఫీజు చెల్లించి, ఎంపిక అయిన కాలేజీలో చేరబోతున్నట్లు ఆన్‌లైన్‌లోనే తెలియజేయవలసి ఉంటుంది. జూన్ 1వ తేదీ నుంచి అన్ని పాలిటెక్నిక్ కళాశాలలో శిక్షనా తరగతులు మొదలవుతాయి. మొదటి రోజు నుంచే విద్యార్దులందరూ తరగతులకు హాజరుకావాలి. 

ఖర్చుతో కూడుకొన్న ఇంజనీరింగ్, మెడికల్ వంటి కోర్సులు చేయలేని విద్యార్దులకు తక్కువ ఖర్చుతో పాలిటెక్నిక్ కాలేజీలలో సాంకేతిక కోర్సులు చేయవచ్చు. పాలిటెక్నిక్ లో సాంకేతిక కోర్సులు పూర్తిచేసినవారికి మంచి ఉద్యోగం, ఉపాది అవకాశాలున్నాయి. పాలిటెక్నిక్ లో మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, ఆటోమోబైల్, కంప్యూటర్స్, ఎలెక్ట్రానిక్స్ మరియు డీ ఫార్మసీ వంటి మెడికల్ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. 

వీటిని పూర్తి చేసి ఉద్యోగం లేదా ఉపాది సంపాదించుకొని తమ కాళ్లపై తాము నిలబడిన తరువాత మళ్ళీ ఉన్నత చదువులు చదుకోవచ్చు. ఐ‌టిఐ చేసిన విద్యార్దులకు వివిద పరిశ్రమలలో లేదా సంస్థలలో కార్మికులుగా ఉద్యోగావకాశాలు లభిస్తే, పాలిటెక్నిక్ చేసిన విద్యార్దులకు సూపర్వైజర్, ఫోర్ మెన్, జూనియర్ ఇంజనీర్ వంటి పైస్థాయి ఉద్యోగాలు లభిస్తాయి. పాలిటెక్నిక్ కాలేజీలు అందిస్తున్న కోర్సులు, ఫీజులు తదితర వివరాల కోసం  ఆన్‌లైన్‌లో https://www.careers360.com/ వంటి అనేక వెబ్‌సైట్లున్నాయి. దరఖాస్తు చేసుకొనే ముందుగానే వాటి ద్వారా సదరు కోర్సులకు సంబందించి పూర్తి అవగాహన ఏర్పరచుకొంటే భవిష్యత్తులో బాగా రాణించవచ్చు. 

Related Post