పదోతరగతి పరీక్ష ఫలితాలు విడుదల

May 13, 2019
img

పదోతరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి సోమవారం ఉదయం 11.30 గంటలకు సచివాలయంలోని డీ బ్లాకులో పదోతరగతి పరీక్షా ఫలితాలను విడుదల చేశారు. ఈసారి రాష్ట్రంలో మొత్తం 4,73,321 మంది పదో తరగతి పరీక్షలకు హాజరుకాగా వారిలో 92.43 శాతం మంది విద్యార్దులు ఉత్తీర్ణులయ్యారు. ఈసారి కూడా బాలికలే పైచేయి సాధించారు. బాలురి ఉత్తీర్ణత శాతం 91.18 కాగా బాలికలు 98.63 శాతం ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్రంలో 99.30 శాతం ఉత్తీర్ణతో జగిత్యాల జిల్లా ప్రధమస్థానంలో నిలువగా హైదరాబాద్‌ 89.09 శాతంతో చివరి స్థానంలో నిలిచింది. ఇంటర్మీడియట్‌ పరీక్షలకు దాదాపు 5 లక్షలమంది హాజరు కాగా వారిలో 3.28 లక్షలమంది ఫెయిల్ అయ్యారు. కనుక ఇంటర్ ఫలితాలతో పోలిస్తే పదో తరగతి విద్యార్దులు చాలా చక్కటి ఫలితాలు సాధించినట్లు స్పష్టం అవుతోంది. 

పదో తరగతిలో ఫెయిల్ అయిన విద్యార్దుల కోసం జూన్ 10 నుంచి 27వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించబడతాయి. వాటికి పరీక్ష ఫీజు చెల్లించడానికి ఈ నెల 27వరకు గడువు ఉన్నట్లు జనార్ధన్ రెడ్డి తెలిపారు. 

పదో తరగతి పాస్, ఫెయిల్ అయిన విద్యార్దులకు అనేక కోర్సులు అందుబాటులో ఉన్నాయి. కనుక విద్యార్దులు తమకు బాగా నచ్చిన, పట్టున్న కోర్సులను ఎంచుకొంటే భవిష్యత్తులో ఇబ్బందిపడకుండా హాయిగా చదువుకోవచ్చు. మంచి ఉద్యోగం సంపాదించుకోవచ్చు. పదో తరగతి తరువాత అందుబాటులో ఉన్న కోర్సుల వివరాలు: 

  

Related Post