10వ తరగతి ఫలితాలు మే 13న

May 10, 2019
img

తెలంగాణ 10వ తరగతి ఫలితాలు ఈనెల 13వ తేదీన ఉదయం 11.30 గంటలకు ప్రకటించబోతున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ తెలియజేసింది. ఈసారి రాష్ట్రంలో మొత్తం 4,73,321 మంది విద్యార్దులు 10వ తరగతి పరీక్షలు వ్రాశారు. పరీక్షా ఫలితాలను అధికారికంగా జారీచేసిన తరువాత దాదాపు అన్ని దినపత్రికలు ఆన్‌లైన్‌లో ఉంచుతున్నాయి కనుక వెంటనే చూసుకోవచ్చు. ఇంటర్ ఫలితాలలో ఏర్పడిన గందరగోళం దృష్టిలో ఉంచుకొని 10వ తరగతి ఫలితాలలో అటువంటి సమస్యలు పునరావృతంకాకుండా విద్యాశాఖ అన్ని జాగ్రత్తలు తీసుకొంది.  


Related Post