మే 14 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు

April 19, 2019
img

మే 14 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించబోతున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ కుమార్ మీడియాకు తెలిపారు. కనుక ఈనెల 25లోగా పరీక్ష ఫీజులు చెల్లించి పేర్లు నమోదు చేసుకోవాలని ఆయన విద్యార్ధులను కోరారు. ఇంటర్ పరీక్షలు వ్రాసిన విద్యార్ధులు ఎవరైనా తమ జవాబు పత్రాలను రీ కౌంటింగ్ చేయించుకోవాలనుకొంటే ఒక్కో పత్రానికి రూ.100 చొప్పున ఫీజు చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. రూ.600 ఫీజు చెల్లించినట్లయితే ఆరు జవాబు పత్రాల జిరాక్సు కాపీలు అందజేస్తామని తెలిపారు. వీటి కోసం నేటి నుంచి ఈ నెల 25లోగా దరఖాస్తు చేసుకొని ఫీజు చెల్లించవలసి ఉంటుందని తెలిపారు. 

మే 25 నుంచి 29వరకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్,  మే 30న హ్యూమన్ వాల్యూస్, మే 31న పర్యావరణ విద్య పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు.  


Related Post