తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల

April 18, 2019
img

తెలంగాణ ఇంటర్మీడియెట్ పరీక్షా ఫలితాలు గురువారం సాయంత్రం విడుదలయ్యాయి. 4,52,550 మంది విద్యార్ధులు ఇంటర్ మొదటి సం.పరీక్షలు వ్రాయగా వారిలో 2,70, 575 మంది (59.8 శాతం) మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. అదేవిధంగా 4,90,169 మంది విద్యార్ధులు ఇంటర్ ద్వితీయ సం.పరీక్షలు వ్రాయగా వారిలో 2,71,949 మంది (65 శాతం) హాజరయ్యారు. 

ఇంటర్ ద్వితీయ సం.పరీక్షలలో 76 శాతం ఉత్తీర్ణతతో మేడ్చల్ జిల్లా ప్రధమస్థానంలో నిలువగా, మెదక్‌ జిల్లా కేవలం 34 శాతం ఉత్తీర్ణతతో చివరి స్థానంలో నిలిచింది. వచ్చే నెల 14 నుంచి ఇంటర్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని విద్యాశాఖ కార్యదర్శి బీ జనార్దన్‌రెడ్డి తెలిపారు. 


Related Post