ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే...

April 16, 2019
img

రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ పరీక్షా ఫలితాలు ఆలస్యం అవుతుండటంతో విద్యార్ధులు, వారి తల్లితండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మీడియాలో కూడా రకరకలుగా వార్తలు, ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సోమవారం ఉదయం ఇంటర్ బోర్డు కార్యాలయం ముందు విద్యార్ధి సంఘం మెరుపు ధర్నా చేసి నిరసన తెలియజేసింది. దీంతో మేలుకొన్న ఇంటర్ బోర్డు కార్యదర్శి ఏ అశోక్, ఏప్రిల్ 18న ఇంటర్ ఫలితాలను విడుదలచేస్తామని ప్రకటించారు. పరీక్షా ఫలితాలు ఆలస్యం కావడం గురించి మీడియాలో వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. 


Related Post