టి-సేవ సెంటర్స్ దరఖాస్తులకు గడువు ఏప్రిల్ 30

April 15, 2019
img

రాష్ట్రంలో అన్ని జిల్లాలలో టి-సేవా ఆన్‌లైన్‌ సెంటర్స్ ఏర్పాటు చేయడానికి ఆసక్తి, తగిన అర్హత కలిగిన అభ్యర్ధులు ఏప్రిల్ 30లోగా దరఖాస్తు చేసుకోవలసిందిగా టి-సేవ డైరెక్టర్ ఏ. వెంకట్ రెడ్డి తెలిపారు. స్వర్ణ తెలంగాణ స్వయం ఉపాధి పధకం కింద నడుపబోయే ఈ ఆన్‌లైన్‌ సేవా సెంటర్ల ఏర్పాటుకు అర్హతలు, చెల్లించవలసిన ధరావతు, గుర్తింపు పత్రాలు మొదలైన పూర్తి వివరాల కోసం http://www.tsevacentre.com/franchise-enquiry.html  వెబ్‌సైట్‌లో సైటులో లభిస్తాయి. దాని ద్వారానే ఆన్‌లైన్‌లో దరఖాస్తు సమర్పించవలసి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మహిళా అభ్యర్ధులకు రిజిస్ట్రేషన్ ఫీజులో 25 శాతం రాయితీ ఉంటుందని తెలిపారు. వీటికి సంబందించి వివరాలను ఫోన్ ద్వారా తెలుసుకోగోరేవారు 81799 55744 లేదా 9505 800050 నెంబర్లకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చునని టి-సేవ డైరెక్టర్ ఏ. వెంకట్ రెడ్డి తెలిపారు.


Related Post