పదో తరగతి తరువాత...?

March 16, 2019
img

నేటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం అయ్యాయి. వచ్చే నెల 3వ తేదీవరకు పరీక్షలు కొనసాగుతాయి. రాష్ట్రంలో మొత్తం 5,52,302 మంది విద్యార్ధులు ఈ పరీక్షలకు హాజరవుతున్నారు. రెగ్యులర్ విద్యార్ధులలో 2,55,318 మంది బాలురు, 2,52, 492 మంది బాలికలు ఉన్నారు. మిగిలినవారు ప్రైవేట్ విద్యార్ధులు. 

ఈ ఐదున్నర లక్షలమంది విద్యార్దులు రేయింబవళ్లు ఎంతో కష్టపడి చదివి పరీక్షలు వ్రాస్తుంటారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. విద్యార్ధుల జీవితంలో పదో తరగతి పరీక్షలు ఒక పెద్ద మలుపువంటివని అందరికీ తెలుసు. కనుక ఈ పరీక్షలలో మంచి మార్కులతో ఉత్తీర్ణులవడం ఎంత ముఖ్యమో ఆ తరువాత ఇంటర్మీడియెట్ కోసం తగిన గ్రూపును, కాలేజీని ఎంచుకోవడం కూడా అంతే ముఖ్యం. ఒకవేళ ఏ కారణం చేతైన ఇంటర్ చదవలేని స్థితిలో ఉన్న విద్యార్ధులకు 10వ తరగతి అర్హతతో అనేక విద్యావకాశాలున్నాయి. విద్యార్ధులకున్న అనేకానేక అవకాశాల గురించి ఈ క్రిందన ఈయబడిన చార్టులో పేర్కొనబడింది. 

కనుక 10వ తరగతి పూర్తి చేసిన విద్యార్ధులు, గుడ్డిగా ఏదో ఓ కాలేజీలో, ఏదో ఓ గ్రూపులో ఏదో ఓ కోర్సులో చేరిపోకుండా తమ ప్రతిభాపాటవలు, మార్కులు, అభిరుచి, ఆర్ధిక స్తోమతు మొదలైన అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని తగిన నిర్ణయం తీసుకోవడం మంచిది.     


Related Post