ఏడున్నర లక్షల అభ్యర్ధులలో 693 మంది వీఆర్వోలుగా ఎంపిక

March 02, 2019
img

వీఆర్వోలుగా ఎంపికైనవారి జాబితాను తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(టీఎస్‌పీఎస్సీ) శుక్రవారం ప్రకటించింది. రాష్ట్రంలో మొత్తం 700 వీఆర్వో పోస్టులుండగా మొత్తం 7,87,049 మంది అభ్యర్ధులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. వారిలో 7,38,885 మంది ఉత్తీర్ణులయ్యారు. మళ్ళీ వారిలో అత్యుత్తమ ర్యాంకు సాధించినవారిలో నుంచి ఒక్కో పోస్టుకు ముగ్గురు చొప్పున ఎంపికచేసి వడపోత తరువాత మొత్తం 693 మందిని వీఆర్వో ఉద్యోగాలకు ఎంపిక చేసింది. వీఆర్వోలుగా ఎంపికైన అభ్యర్ధుల ధ్రువపత్రాల పరిశీలన కూడా ముగిసింది కనుక త్వరలోనే వారందరికీ అపాయింట్మెంటు లెటర్స్ అందనున్నాయి.       


Related Post