నిరుద్యోగులకు గమనిక: నేటి నుంచి గజ్వేల్‌లోఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్స్

February 26, 2019
img

రాష్ట్రంలో నిరుద్యోగులకు ముఖ్య గమనిక. నేడు, రేపు (మంగళ, బుదవారం) గజ్వేల్‌లో, మళ్ళీ ఫిబ్రవరి 28, మార్చి1వ తేదీలలో గజ్వేల్‌లో ఇంటిగ్రేటడ్ ఆఫీస్ కాంప్లెక్స్ లో ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్స్ ర్యాలీ జరుగబోతోంది. ఎయిర్ మెన్ గ్రూప్-వై (నాన్-టెక్నికల్) ఉద్యోగాలకు ఎంపిక జరుగుతోంది.  

నేటి నుంచి ప్రారంభం అయ్యే ఈ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ ర్యాలీలో ఉమ్మడి హైదరాబాద్‌, ఉమ్మడి రంగారెడ్డి, నల్గొండ, నిజామాబాద్‌, వరంగల్ జిల్లాలోని ‘అవివాహిక నిరుద్యోగులు’ మాత్రమే పాల్గొనే అవకాశం ఉంది. 

ఫిబ్రవరి 28, మార్చి1వ తేదీలలో జరిగే ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్స్ ర్యాలీలో ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, మెదక్‌ ఉమ్మడి జిల్లాలకు చెందిన ‘అవివాహిక నిరుద్యోగులు’ పాల్గొనవచ్చు. 

విద్యార్హతలు: ఇంటర్మీడియెట్ లేదా 10+2 లేదా తత్సమానమైన పరీక్ష (ఏ గ్రూపులోనైనా) పాస్ అయ్యుండాలి. కనీసం 50శాతం మార్కులు వచ్చి ఉండాలి.   

పరీక్షా విధానం: మొదటి రోజున దేహదారుడ్య పరీక్ష, రాత పరీక్షలు నిర్వహిస్తారు. రెండవరోజున ఆడాప్టబిలిటీ (1&2) పరీక్షలు మరియు డైనమిక్ ఫ్యాక్టర్ పరీక్షలు నిర్వహిస్తారు.      

ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగం లభిస్తే మంచి జీతభత్యాలతో పాటు సమాజంలో ఎంతో గౌరవం లభిస్తుంది. కనుక నిరుద్యోగ యువకులకు త ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడం మంచిది. 

ఈ ఉద్యోగాలకు సంబందించి మరిన్ని వివరాలకు : https://www.9curry.com/notices/643491 లేదా https://media.9curry.com/uploads/attachment/attachment/37132/indian-air-force-iaf-gajwel-recruitment-rally-2019-airmen-group-y-advt-details-dba83b.pdf వెబ్ సైటులో లభిస్తాయి. 

Related Post