రైల్వేలో 1.3 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ జారీ

February 21, 2019
img

నిరుద్యోగులకు గొప్ప శుభవార్త. దేశంలో అత్యధిక ఉద్యోగాలు కల్పిస్తున్న రైల్వేశాఖ తాజాగా 1.3 లక్షల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీని ద్వారా దేశవ్యాప్తంగా వివిద డివిజన్ల పరిధిలో ఏర్పడిన ఖాళీలను భర్తీ చేయబోతోంది. వీటిలో టెక్నికల్, నాన్-టెక్నికల్, క్లరికల్, పారా మెడికల్ ఉద్యోగాలతోపాటు స్టేషన్ మాష్టర్ వంటి ఉద్యోగాలు కూడా ఉన్నాయి. వీటిలో లెవెల్-1 పోస్టులు లక్ష ఉన్నాయి. నాన్-టెక్నికల్ పోస్టులు 30,000 ఉన్నాయి.

నాన్-టెక్నికల్ పోస్టులకు ఈ నెల 28 నుంచి ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్స్ మొదలవుతాయి. పారా మెడికల్ స్టాఫ్ పోస్టులకు మార్చి 4న, ఇతర కేటగిరీలలో పోస్టులకు మార్చి 8న, లెవెల్-1 పోస్టులకు మార్చి 12న ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులన్నిటికీ త్వరలోనే మళ్ళీ వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేయబోతోంది. కనుక నిరుద్యోగ యువతీ యువకులు ఇక నుంచి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అధికారిక వెబ్ సైటు: www.rrbcdg.gov.in ను చూసుకొంటూ తమ తమ విద్యార్హతలకు తగిన ఉద్యోగ నోటిఫికేషన్లను గుర్తించి వాటిలో పేర్కొన్నట్లుగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడం మంచిది. 

 రైల్వేశాఖ భర్తీ చేయబోతున్న ఉద్యోగాలు: 

1. కమర్షియల్ అప్రెంటీస్

2. ట్రెయిన్స్ క్లర్క్  

3. స్టెనో గ్రాఫర్ 

4. జూనియర్ క్లర్క్ కం టైపిస్ట్

5. సీనియర్ క్లర్క్ కం టైపిస్ట్

6. జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కం క్లర్క్

7. అకౌంట్స్ క్లర్క్ కం టైపిస్ట్

8. కమర్షియల్ కం టికెట్ క్లర్క్ 

9. సీనియర్ కమర్షియల్ కం టికెట్ క్లర్క్ 

10. చీఫ్ లా ఆఫీసర్ 

11. జూనియర్ ట్రాన్స్లేటర్ (హిందీ)

12. ట్రాఫిక్ అసిస్టెంట్ 

13. గూడ్స్ గార్డ్

14. స్టేషన్ మాస్టర్ 

15. స్టాఫ్ నర్స్ 

16. హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్ 

17. ఫార్మాసిస్ట్ 

18. ఈసీజీ టెక్నీషియన్ 

19. ల్యాబ్ అసిస్టెంట్ 

20. ల్యాబ్ సూపరింటెండెంట్

21. ఆర్.ఆర్.బి. మినిస్టీరియల్ 

Related Post