హైదరాబాద్‌లో 23న జాబ్ మేళా

February 21, 2019
img

ఈనెల 23న హైదరాబాద్‌లో కూకట్‌పల్లి వద్దగల జె.ఎన్.టి.యులో భారీ జాబ్ మేళా జరుగనుంది. ఈ మేళాలో 25 కంపెనీలు పాల్గొని వివిద ఉద్యోగాలలో 2,000 మందిని భర్తీ చేసుకోబోతున్నాయని యూనివర్సిటీ-ఇండస్ట్రీ ఇంటర్ యాక్షన్ సెంటర్ డైరెక్టర్ డా.సిహెచ్. వెంకట రమణారెడ్డి మీడియాకు తెలిపారు. 2016, 17, 18 సం.లలో బీ.కాం, బీఎస్సీ, బీటెక్, ఎంబీయే, డిప్లొమా పూర్తిచేసిన అభ్యర్ధులు ఈ మేళాకు హాజరుకావచ్చని తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జాబ్ మేళా ఉంటుందని తెలిపారు. దీనికి హాజరయ్యే అభ్యర్ధులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్స్, మూడు సెట్లు జిరాక్స్ కాపీలు, పాసుపోర్ట్ ఫోటోలు తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలని సూచించారు. ఈ జాబ్ మేళాలో పాల్గొనదలచిన విద్యార్ధులు ముందుగా https://goo.gl/forms/EQDKUGFTGQaXyaOC2 లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవలసి ఉంటుందని తెలిపారు. 

           


Related Post